
@వీకెండ్‌లో పోటెత్తుతున్న భక్తులు
@భారీగా స్వామి వారికి హుండీ ఆదాయం
@సర్వదర్శనానికి 24 గంటల సమయం
@వైకుంఠం క్యూ కాంప్లెక్స్ హౌజ్‌ఫుల్
@శనివారం ఒక్కరోజే రూ.4.27 కోట్ల ఆదాయం
తిరుమల, జూలై 02
కలియుదైవం శ్రీవేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం తిరుమలలో వీకెండ్‌లో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం రాత్రి నుంచి తిరుమల భక్త జనసందోహంతో పొటెత్తింది. ఫలితంగా శుక్ర,శని, ఆదివారాల్లో భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు అన్ని పూర్తిగా భక్తులతో నిండిపోయి కిక్కిరిసాయి..
భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూ లైన్లలో ఒకరోజు పాటు ఉండాల్సి వస్తుండడంతో, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల ఆకలిని తీర్చేందుకు పెరుగన్నం, కిచిడి, ఉప్మా, బిసిబేళా బాత్, పాలు, మజ్జిగ అందించింది
శనివారం తిరుమల శ్రీవారిని 82,999 మంది దర్శించుకున్నారు. 38,875 మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు.

భక్తులు బూరి విరాళాలు సమర్పించడంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి హుండీ రూపంలో భారీ ఆదాయం లభించింది. శనివారం ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.27 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
