
పలువురి అభ్యర్ధుల మార్పులు
త్వరలో మిగితా వారికి అందిస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 15:
బీఆర్ఎస్ పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 51 మందికి మాత్రమే ఆదివారం బీఫామ్ అందజేసింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో సమావేశమై త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫాములను అందజేశారు. ముందుగా ప్రకటించినట్లుగా 119 మంది జాబితాలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతున్నట్టు కేసిఆర్ స్పష్టం చేశారు. టికెట్టు రానీ ఏమ్మెల్యే, ఇతర నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేయాలని సీఎం కేసీఆర్ సీనియర్ నాయకులకు సూచించారు. ప్రస్తుతం సిద్ధంగా ఉన్న 51 బీఫాములను ఆయన అందజేశారు.

పార్టీ అభ్యర్థులతో సీఎం కేసిఆర్
కీలక అంశాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం
నామినేషన్లకు ఇంకా సమయం ఉంది..హైరానా పడకండి..ముందుగానే బీ ఫామ్ఇస్తున్నాం..జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపండి..చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవకండి..చివరి రోజే అందరూ వేయాలని ఇబ్బంది పడకండి..బీ ఫామ్స్ తప్పుగా నింపకండి..టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి..శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తో పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారు..అలాంటి అజాగ్రత్త ఉండకండి..న్యాయ కోవిదులు ఉన్నారు..అంత మాకే తెలుసు అనుకోకండి..కచ్చితంగా వారిని సంప్రదించాలి..ఎన్నికకు ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయి..తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉంది..అప్డేట్ ఓటర్ లిస్ట్ వచ్చింది ..ఇవాళ రేపు కూడా బీ ఫామ్ ఇస్తాం..ఇవాళ ఒక్కరోజు 51 మందికి బీ ఫామ్ ఇస్తున్నాం