
హైదరాబాద్, నవంబరు 26
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం రాష్ట్రంలో బీజేపీ ప్రచారంలో భాగంగా యోగి హైదరాబాద్‌లో పలు నియోజక వర్గాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి లో బీజేపీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్, పార్టీ అభ్యర్ధులు యోగి ఆదిత్యానాథ్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతి పార్టీలేని విమర్శించారు. దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేందుకు మోడీకి ఓటు వేయాలనీ, బీజేపీ మేనిఫెస్టో కు మోడీ గ్యారెంటీ అని పేర్కొన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి సైలెంట్ ఓటింగ్ జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని యోగి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెరిక సురేష్‌ను పరిచయం చేస్తున్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు