
హైదరాబాద్, నవంబరు 29
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చారిత్రాత్మకంగా ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల ఎన్నికల ప్రచార పర్యటన, ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షునితోపాటు 150మందికి పైగా జాతీయ నేతలు, 200మంది రాష్ట్ర నేతలతో నిర్వహించిన ప్రచార వ్యూహం ఫలించిందనీ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ, సభ్యుల ప్రభావంతమైన పనితీరు పట్ల ప్రధాని సంతృప్తిని వ్యక్తం చేశారని సురేష్ తెలిపారు. హిందూ ఓటర్ల పోలరైజేషన్, బీసీ సీఎం ప్రకటన, ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేయడం వంటి అంశాలు పార్టీకి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ, అస్సాం సీఎం హేమంత బిష్వా తదితర ప్రభావవంతమైన నేతల మద్దతుతో అఖండ విజయాన్ని సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి నేతల ప్రచారం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల సహకారం పెద్ద ఎత్తున లభించిందని తెలిపారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ప్రేమందర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు బాల్‌రాజ్, కిలారు దిలీప్, వెంకట్ రెడ్డి, కోఆర్డినేటర్ పెరిక సురేష్, ఆరు జోన్‌ల సమన్వయకర్తలు, సుభాష్ చందర్ జీ, ఆలె భాస్కర్, రాజ్ సంజయ్, నందనం దివాకర్, వెంకట్, శరత్ సింగ్ రాకేష్ వంటి కీలక నేతల పాత్ర పోషించారని పెరిక సురేష్ వివరించారు.
