హైదరాబాద్, డిసెంబరు 03
తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా పేరున్న బీఆర్‌ఎస్ పార్టీకి అనూహ్యంగా పరాభవం ఎదురైంది. గత రెండు పర్యాయాలు వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్ ఈసారి బీఆర్‌ఎస్‌గా ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలైంది. గులాబీ బాస్‌లు హైదరాబాద్ మీద తప్ప ఇతర ప్రాంతాల మీద ఫోకస్ పెట్టడం లేదని గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్నుంచో అసంతృప్తి ఉంది. పంట నష్టం పట్టించుకోలేదనీ, రుణమాఫీ చివరి వరకు సాగదీసి పూర్తి చేయక పోవడం రైతాంగాన్ని ఆగ్రహానికి గురి చేసింది. అందుకు తగ్గట్టే ప్రస్తుత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు తమ తీర్పు వెల్లడించారు. కర్ణాటక ఫలితాల అనంతరం దాని ప్రభావం తెంగాణ ఎన్నికల్లో ఉంటుందనీ పొలిటికల్ ఎనలిస్ట్‌లు అంచనా వేసినా..రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదుగుతున్నా సరే కేసీఆర్ పట్టించుకోలేదు. రేవంత్ కు అంత సీన్ లేదని తక్కువ అంచనా వేశారు. మెజారీటీకి కావాల్సిన సీట్లు ఏ మాత్రం తగ్గినా తన మిత్రపక్షం ఎంఐఎం ఉండనే ఉందని భావించారు. అదే విధంగా మరేమైనా సీట్లు కావాల్సి వస్తే చివరికీ బీజేపీ గెలిచిన వారితో సర్దుతాయని అనుకున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంచనాలన్నింటినీ తల్లకిందులు చేశారు. కాంగ్రెస్‌కు వేరెవరిపైనా ఆధారపడాల్సిన అవసరం కల్పించ కుండా సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. మొత్తానికి గులాబీ నేతల అతి విశ్వాసమే ఈ ఎన్నికల్లో వారి కొంప ముంచిందనే పొలిటికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.
బీఆర్‌ఎస్ గెలిచిన స్తానాలు
1.అంబర్‌పేట కాలేరు వెంకటేశ్(BRS)
2.సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్(BRS)
3.సికింద్రాబాద్ టి పద్మారావు(BRS)
4.కంటోన్మెంట్ (ఎస్సీ) లాస్య నందిత(BRS)
5.నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మా రెడ్డి(BRS)
6.బాల్కొండ వేముల ప్రశాంత్‌రెడ్డి(BRS)
7.బాన్సువాడ పోచారం శ్రీనివాస్‌రెడ్డి(BRS)
8.మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి(BRS)
9.భద్రాచలం (ఎస్టీ) తెల్లం వెంకట్రావు(BRS)
10.కోరుట్ల కల్వకుంట్ల సంజయ్(BRS)
11.కుత్బుల్లాపూర్ కె.పి.వివేకానంద గౌడ్(BRS)
12.మేడ్చల్ చామకూర మల్లారెడ్డి(BRS)
13.సిరిసిల్ల KT రామారావు(BRS)
14.జహీరాబాద్ (ఎస్సీ) మాణిక్‌రావు(BRS)
15.స్టేషన్ ఘన్‌పూర్ కడియం శ్రీహరి(BRS)
16.జనగాం పల్లా రాజేశ్వర్‌రెడ్డి(BRS)
17.దుబ్బాక కొత్త ప్రభాకర్‌రెడ్డి(BRS)
18.కరీంనగర్ గంగుల కమలాకర్(BRS)
19.ఆసీఫాబాద్ కోవాలక్ష్మీ(BRS)
20.బోధ్ అనీల్ జాదవ్(BRS)
21.ఎల్బీననగర్ సుధీర్‌రెడ్డి(BRS)
22.ఉప్పల్ లక్ష్మారెడ్డి (BRS)
23.ఖైరతాబాద్ దానం నాగేందర్(BRS)
24.జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్(BRS)
25.శేరిలింగంపల్లి అరికల పూడి గాంధీ(BRS)
26.కూకట్‌పల్లి మాదవరం కృష్ణారావు(BRS)
27.రాజేంద్రనగర్ ప్రకాష్‌గౌడ్(BRS)
28.సూర్యపేట జగదీష్‌రెడ్డి (BRS)
29.ముషీరాబాద్ ముఠాగోపాల్(BRS)
30.చేవెళ్ల కాలె యాదయ్య(BRS)
31.సిద్ధిపేట హరీష్‌రావు(BRS)
32.సంగారెడ్డి చింత ప్రభాకర్(BRS)
33.జగిత్యాల డాక్టర్ సంజయ్(BRS)
34.హుజూరాబాద్ పాడి కౌశిక్‌రెడ్డి (BRS)
35.పటాంచెరు మహిపాల్‌రెడ్డి (BRS)
36.గజ్వేల్ కేసీఆర్(మాజీ సీఎం)(BRS)
37.మల్కాజీగిరి మర్రి రాజశేఖర్(BRS)
38.గద్వాల కృష్ణమోహన్‌రెడ్డి (BRS)
39.అలంపూర్ విజయుడు(BRS)