తెలంగాణలో కాంగ్రెస్ విజయం
64స్థానాల్లో పార్టీ గెలుపు
రేవంత్ సారథ్యంలో విజయ దిశగా పురోగమనం
పూర్తిగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం
2004 తరహా వ్యతిరేకతను అందిపుచ్చుకున్న కాంగ్రెస్
హైదరాబాద్, డిసెంబరు 03
తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడించి అనూహ్యంగా 64స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2004లో అధికారం చేపట్టిన కాంగ్రెస్, గత 2009లో తిరిగి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేక పోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి నాయకులందరినీ ఏకతాటిపై నడిపించి గెలుపును సుసాధ్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. 6గ్యారంటీలతో పాటు పలు డిక్లరేషన్ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లింది. రైతులు, యువత, మైనార్టీ, ఎస్సీ,ఎస్టీ, బీసీ డిక్లరేషన్లను ప్రకటించింది. అదే విధంగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పర్యటించి పార్టీ విజయానికి పునాదులు వేశారు. దీనికి తోడు అధికార బీఆర్‌ఎస్ పార్టీ అహంకార పూరిత విధానాలు, ధరణి పోర్టల్, కాళేశ్వరం అవినీతి, కోట్ల రూపాయల అప్పులు, విద్యుత్ సంస్థలను అప్పుల్లో ముంచేయడం వంటి విధానాలు ఒకవైపు ఉండగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు, భూకబ్జాలు బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారగా అవే అస్త్రాలను అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేసింది.

కాంగ్రెస్ గెలిచిన స్థానాలు..
1.మానకొండూరు (ఎస్సీ) కవ్వంపల్లి సత్యనారాయణ(INC)
2.పాలేరు పొంగులేటి శ్రీనివాస రెడ్డి(INC)
3.మధిర (ఎస్సీ) మల్లు భట్టి విక్రమార్క(INC)
4.దేవరకద్ర జి.మధుసూదన్‌రెడ్డి(INC)
5.జడ్చర్ల అనిరుధ్‌రెడ్డి(INC)
6.మెదక్ మైనంపల్లి రోహిత్(INC)
7.నాగార్జున సాగర్ కుందూరు జైవీర్‌రెడ్డి(INC)
8.నల్గొండ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(INC)
9.మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(INC)
10.నకిరేకల్ (ఎస్సీ) వేముల వీరేశం(INC)
11.నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతిరెడ్డి(INC)
12.బోధన్ పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి(INC)
13.షాద్‌నగర్ కె.శంకరయ్య (INC)
14.కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి(INC)
15.అశ్వారావుపేట (ఎస్టీ)ఆది నారాయణరావు(INC)_
16.ఇల్లెందు (ఎస్టీ) కోరం కనకయ్య(INC)
17.ధర్మపురి (ఎస్సీ) అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(INC)
18.ఎల్లారెడ్డి మదన్ మోహన్‌రావు(INC)
19.మహబూబాబాద్ (ఎస్టీ)డాక్టర్ మురళీనాయక్(INC)
20.బెల్లంపల్లి (ఎస్సీ) గడ్డం వినోద్(INC)
21.చెన్నూరు గడ్డం వివేక్(INC)
22.నాగర్‌కర్నూల్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి(INC)
23.మంథని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(INC)
24.రామగుండం ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్(INC)
25.పెద్దపల్లి సీహెచ్. విజయరమణారావు(INC)
26.వేములవాడ ఆది శ్రీనివాస్(INC)
27.నారాయణ్ ఖేడ్ పట్లోల్ల సంజీవరెడ్డి(INC)
28.అందోల్ (ఎస్సీ) దామోదర్ రాజ నర్సింహా(INC)
29.హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్(INC)
30.తుంగతుర్తి (ఎస్సీ) మందుల శామ్యూల్(INC)
31.హుజూర్‌నగర్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి(INC)
32.కొడంగల్ ఎనుమల రేవంత్‌రెడ్డి(INC)
33.తాండూరు బి.మనోహర్‌రెడ్డి(INC)
34.వికారాబాద్ (ఎస్సీ) గడ్డం ప్రసాద్‌కుమార్(INC)
35.వనపర్తి టి.మేఘారెడ్డి(INC)
36.నర్సంపేట దొంతి మాధవరెడ్డి(INC)
37.వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్‌రెడ్డి(INC)
38.వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ(INC)
39.ఆలేరు బీర్ల ఐలయ్య(INC)
40.భువనగిరి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి(INC)
41.ములుగు (ఎస్టీ) డి.అనసూయ (సీతక్క)(INC)
42.మక్తల్ వాకిటి శ్రీహరి(INC)
43.నారాయణపేట్ పర్ణిక చిట్టెం(INC)
44.భూపాలపల్లి గండ్రసత్యనారాయణ(INC)
45.పాలకుర్తి యశస్వినీ(INC)
46.డోర్నకల్ డాక్టర్ రాంచందర్ నాయక్(INC)
47.పరకాల రేవూరి ప్రకాష్‌రెడ్డి(INC)
48.మంచిర్యాల ప్రేంసాగర్‌రావు(INC)
49.ఖానాపూర్ ఎడ్మ బొజ్జా(INC)
50.చొప్పదండి మేడిపల్లి సత్యాం(INC)
51.ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి (INC)
52.పరిగి రాంమోహన్‌రెడ్డి (INC)
53.మహబూబ్‌నగర్ ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి (INC)
54.అచ్చంపేట్ వంశీకృష్ణ(INC)
55.కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు(INC)
56.దేవరకొండ బాలు నాయక్(INC)
57.కోదాడ పద్మావతిరెడ్డి (INC)
58.పరకాల రేవూరి ప్రకాష్‌రెడ్డి (INC)
59.వర్థన్నపేట కేఆర్ నాగరాజు(INC)
60.పినపాక పాయం వెంకటేశ్వర్లు(INC)
61.వైరా రాందాస్ (INC)
62.సత్తుపల్లి మట్ట రాగమయి(INC)
63.జుక్కల్ లక్ష్మీకాంతరావు(INC)
64.ఎల్లారెడ్డి మదన్ మోహన్(INC)





