
హైదరాబాద్, డిసెంబర్ 04
ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో విద్యుత్ రంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రభాకర్ రావు పై నేరుగా విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావును ట్రాన్స్ కో, జెన్కో కు సీఎండీ చేయడం వల్లే విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని రేవంత్‌రెడ్డి పలు మార్లు ఆరోపణలు చేశారు.

ఛత్తీస్‌గఢ్ తో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఆరోపణలు చేయడంతో పాటు, బీహెచ్‌ఈఎల్ నుంచి ఇండియా బుల్స్ సంస్థ కొనుగోలు చేసి మధ్యలో ఒప్పందం రద్దు చేసుకుని వదిలించుకున్న కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు అంటగట్టారనీ రేవంత్‌రెడ్డి ప్రభాకర్‌రావుపై నేరుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు తలొగ్గి ప్రభాకర్‌రావు అనేక తప్పిదాలు చేశారనీ, వెంటనే రిజైన్ చేయాలని పలుమార్లు రేవంత్ ప్రతిపక్షన నేతగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కరెంటు కొనుగోళ్లలో అవినీతి అనీ, యాదాద్రి పవర్ ప్లాంట్ లేట్ చేయడం, నిర్మాణంలో సబ్ కాంట్రాక్టుల్లో మాజీ సీఎం కేసీఆర్ బంధులకు ఇచ్చారని రేవంత్‌రెడ్డి ప్రభాకర్‌రావుపై అప్పట్లో ఆరోపణలు చేయడం సెన్షేషన్ అయింది.

ఇలా గతంలో నేరుగా టార్గెట్ అయిన దేవులపల్లి తాజాగా ఆదివారం ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో సీఎండీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. విద్యుత్ సంస్థల ఆస్తులను తనాఖా పెట్టి వేలకోట్లు అప్పులు తెచ్చి సంస్థలను నడిపి అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శలు చేశారు. విద్యుత్ సంస్థలకు ఇప్పటికే 40వేల కోట్ల ప్రభుత్వ సంస్థల బాకీలు ఉండగా, మరో 62వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి అంటూ ఆరోపణలు చేవారుతాజాగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో అప్పులు తెచ్చి విద్యుత్ సంస్థలను నడపలేని దుస్థితిలో ఉన్నాయని, ఈ క్రమంలోనే నిధులు లేక ప్రభాకర్ రావు తన విధులకు రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.వచ్చే ప్రభుత్వం ఈ భాధ్యతలు ఎవరికి అప్పగిస్తుందో వేచి చూడాలి.
