
2024లో జరిగే ఎన్నికల్లో మోడీ హాట్రీక్ సృష్టిస్తారు
అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు జైకొట్టారు
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు
తెలంగాణలో 100శాతం ఓటింగ్ పెరిగింది
8సీట్లు గెలుచుకున్నాం
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డ్ బ్రేక్ చేస్తాం
బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, డిసెంబరు 04
2024లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ హ్యాట్రిక్ సృష్టిస్తారని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. తాజాగా జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక ఫలితాలు ప్రజల ఆకాంక్షను జాతీయ స్థాయిలో ప్రతిబింభించాయని స్పష్టం చేశారు. నరేంద్రమోడీ అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు జై కొట్టారని తెలిపారు. ఇండియా కూటమి విభజన రాయకీయాలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. మోడీ అసాధారణ పనితీరుకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రజలు బీజేపీకి పట్టం క్టారని తెలిపారు. మధ్యప్రదేశ్ లో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చారని అన్నారు. అవినీతి విధానాలు, 10 జన్‌పథ్ కేంద్రీకృతంగా జరిగే రాజకీయాలను ప్రజలు తిరస్కరించడంతో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ ఇవ్వలేదు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే 14 శాతం ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తమ ఓటు బ్యాంక్ 100 శాతం పెంచుకునే 8 స్థానాల్లో విజయం సాధించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు పట్టుదలతో లక్ష్యం కోసం ముందుకు సాగుతామని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. 2024పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు రికార్డును బ్రేక్ చేస్తుందని పెరిక సురేష్ వెల్లడించారు.

మందకృష్ణ, కిషన్‌రెడ్డిలతో ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్