
స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్. అశోక్
సెక్రటరీ జనరల్ గా పి.అంజయ్య
హైదరాబాద్, డిసెంబర్ 10
తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (విఏవోఏ) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నికుంది. ఆదివారం హైదాబాద్ లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రభ భవన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్.అశోక్, సెక్రటరీ జనరల్ గా పావకంటి అంజయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ అంజయ్య మాట్లాడుతూ ఉద్యమస్ఫూర్తితో విద్యుత్‌శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీరించిన రేవంత్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు బట్టివిక్రమార్కకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ సంస్థల్లోని అకౌంట్స్ అధికారులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విద్యుత్ శాఖ ఉద్యోగులు, అధికారులు సంస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపారు. ఫలితంగా చీకట్లు తొలగి వెలుగులు నింపాలని చెప్పారు.అదేస్పూర్తిని మరోసారి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రెడ్కో, ఈఎన్ సీ లలో పనిచేసే అకౌంట్స్ అధికారులను తమ సంఘం సభ్యులుగా చేర్చుకుంటున్నట్లు చెప్పారు.

రాష్ట్ర నూతన కార్యవర్గం వీరే..
ప్రెసిడెంట్ ఎన్. అశోక్
సెక్రటరీ జనరల్ -పి.అంజయ్య
వర్కింగ్ ప్రెసిడెంట్ -ఎస్. లక్ష్మణ్
వైస్ ప్రెసిడెంట్ -సిహెచ్ శ్యామల్ రావు
ఎం.ఏ నాసర్ షరీఫ్
ఫైనాన్స్ సెక్రటరీ -పి. అనిల్
ఉమెన్స్ సెక్రటరీ -సిహెచ్ అనురాధ
జాయింట్ సెక్రటరీలు -జె.స్వామి
వి. పరమేష్, ఎల్. దేవదాస్
ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా -కె. నర్సింహ్మామూర్తి
ఎస్ మురళయ్య, కె. వెంకటేష్, సిహెచ్, మధు
కాగా జనరల్ సెక్రటరీ పి. అంజయ్య వరుసగా నాలుగుసార్లు ఎన్నికకావడం విశేషం.