
పార్టీ శ్రేణులకు సురేష్ దిశానిర్ధేశం
హైదరాబాద్, జనవరి 29
ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్ స్థాయిలో తీసుకువెళ్లాలని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం గామ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా పార్టీ శ్రేణులు, మండల కో ఆర్డినేటర్స్, కో కోఆర్డినేటర్స్ లతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పెరిక సురేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో ఫిబ్రవరి 4 నుంచి 11 తేదీ వరకు ప్రతి ప్రవాసి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉండాలని సూచించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ప్రవేశ పెట్టిన అనేక పథకాలను అదేవిధంగా గత పదేళ్లలో మోడీ పాలనలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేలా చేసిన వాస్తవాలను ప్రతి ఇంటికీ తెలియజేయాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి మండలంలో కమిటీలు, శక్తి కేంద్రం, బూత్ కమిటీలు, పన్నా కమిటీలు, వాట్సాప్ గ్రూప్ ల్లో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
ఈకార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పల్నాటి వెంకట్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ , కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి , దాసోజు చారీ , గోగిరెడ్డి లచ్చి రెడ్డి, ప్రోగ్రాం కో కోఆర్డినేటర్ మునికుమర్, మండల అధ్యక్షులు, కో ఆర్డినేటర్ లు, కో కోఆర్డినేటర్ లు తదితరులు పాల్గొన్నారు.
