
ఈ రోజు నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
ఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో
నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన
హైదరాబాద్, ఫిబ్రవరి 01
నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఈరోజు( గురువారం) నుంచి 15వ గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో అందుబాటులోకి వచ్చింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ షో లో వివిధ రకాల మొక్కలతో పాటు హార్టీకల్చర్, అగ్రీకల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని మేళా ఇంచార్జ్ ఖాలీద్ అహ్మద్ వెల్లడించారు.


దేశ వ్యాప్తంగా కోల్ కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై, డార్జిలింగ్, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్ 160కు పైగా స్టాల్స్‌లో ప్రదర్శిస్తారని తెలిపారు. ఇంపోర్టెడ్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారనీ తెలిపారు. నెక్లెస్ రోడ్ లో ఈ షో నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఖాలీద్ అహ్మద్ వివరించారు.


