జాతరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను గిరిజన సాంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లలో పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగద్దనే సంకల్పం తో రాష్ట్ర ముఖ్య మంత్రి 105 కోట్ల నిధులను మంజూరు చేశారు. తెలంగాణలో మహా కుంభమేళగ ప్రసిద్ధి గాంచిన అతి పెద్ద గిరిజన జాతర రెండేళ్లకొకసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలాగు తరలి వస్తారు. ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే వుంది. ఇప్పటికే 58 లక్షలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు రెండు కోటి లక్షల మంది తల్లులను దర్శించుకొనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. భక్తుల తాకిడికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. మేడారంలో తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్ల పైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఉన్న షెడ్లు తో పాటు అదనంగా షెడ్ల నిర్మాణం చేశారు. వరంగల్ నుండి మేడారం మార్గంలో మూడు షెడ్లు ఒక్కోటి 1.65 కోట్లతో నిర్మాణం చేపట్టారు. మేడారం లో తల్లులు గద్దెలకు చేరడానికి ముందు రోజు నుండి తిరిగి వనం లోకి వెళ్లేవరకు భక్తులు నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉండడం ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. ఈ మేరకు గుడారాలతో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రంగం ముందుచూపుతో మేడారం లో భక్తులు ఉండేందుకు నివాసానికి ఏర్పాట్లు చేశారు.

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి మహజతరకు సిద్ధంగా ఉంది. జాతర నిర్వహణకు. త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్ ఏర్పాటు తదితర అనేక ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్లు పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటు ఏర్పాట్లను విస్తృత పరిచారు. భక్తులకు సజావు దర్శనమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర యత్రంగాలు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు.

జాతరకు ముందు ఏర్పాట్లను పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక శ్రద్ద తో పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పనులు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసి సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మేడారం పర్యటించి పనులను పరిశీలించడం ద్వారా ప్రభుత్వం జాతరకు ఇచ్చిన ప్రాముఖ్యత స్పష్టం అవుతోంది. మొత్తంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతరను విజయవంతం చేసేందుకు అన్నీ శాఖలు సమన్వయంతో పనులు పుర్తి చేశారు. రవాణా వ్యవస్థను నియంత్రించేందుకు యంత్రాంగం వాహనాల పార్కింగ్ స్థలాలను గద్దెల కు దూరంగా ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు చేసి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు.

జాతరలో నిరంతర నిఘా:

జాతర మొత్తం లో 300 ఎల్ ఈ డీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను పర్యవేక్షించేందుకై 300 సి సి కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ పరిసర ప్రాంతాలను 10 జోన్లు, 38 సెక్టార్లు, 60 సబ్ సెక్టర్లుగా విభజించి సెక్టార్ల వారీగా అధికారులు సిబ్బందిని నియమించారు. సెక్టోరల్ అధికారులకు ఇచ్చిన వాకిటాకీ ద్వారా వివరాలు తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూన్నారు. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు మేడారం విధులు నిర్వహిస్తున్నారు.

రవాణా శాఖ :

భక్తుల రవాణాకు ఆర్టీసీ ద్వారా 6000 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 2 కోట్ల 25 లక్షల నిధులు మంజూరి చెసింది. తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల, టికెట్ బుకింగ్ కౌంటర్లు, లైటింగ్, రైలింగ్, త్రాగు నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

ఆర్ డబ్ల్యుఎస్ :

ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా 13 కోట్ల 50 లక్షలతో పనులు చేపట్టారు. 17 ఇన్ ఫిల్టరేషన్ వెల్స్ , 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్ ఎర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం కలగకుండా 40 జనరేటర్లు ఎర్పాటు చేశారు. అదే విదంగా 8400 తాత్కాలిక మరుగుదొడ్లు 500 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అలాగే 7 ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తున్నారు. మరుగుదొడ్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 300 మంది సిబ్బందిని నియమించారు.

పంచాయతీరాజ్

జాతరకు లక్షల సంఖ్యలో బక్తులు వస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం ఇక్కడ పెద్ద సవాలు. పారిశుధ్యం పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పారిశుధ్య నిర్వహణకు 4 వేల కార్మికులను ఎర్పాటు చెసింది.

పారిశుధ్య నిర్వహణకు మేడారంకు ఆవల డంపింగ్ యార్డులు అదే విదంగా మేడారం పరిసర ప్రాంతాల్లో 300 మిని డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గద్దెల వద్ద, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నారు.

విద్యుత్ శాఖ: మేడారం జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరాకు 3 కోట్లు 97 లక్షలు రూపాయలతో పనులు చేపట్టారు. నుతనంగా 210 ట్రాన్స్ఫార్మర్ల విద్యుత్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ అందిస్తుంది.

వైద్య శాఖ :

భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారం కల్యాణ మండపంలో కోటి రూపాయలతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి 25 మంది వైద్యులు అలాగే 120 మంది వైద్యాధకారులు, 857 పార మెడికల్ సిబ్బందిని నియమించారు. అదే విధంగా

మేడారం పరిసర గ్రామాల్లోను 75 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా క్యూ లైన్ల వద్ద మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాడ్వాయి లో 10 పడకలు, పస్ర లో 5 పడకల ఆసుపత్రుల తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఈ జాతరలో ప్రత్యేకంగా 30 మొబైల్ అంబులెన్స్ లను ఎర్పాటు చేశారు.

పోలీస్ శాఖ :

మేడారం లో శాంతి బద్రతల పరిరక్షణకు, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 12 వేల పోలీస్ సిబ్బందితో 300 సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఎర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text