
హైదరాబాద్, ఫిబ్రవరి 20
ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అన్నారు. మంగళవారం విజయ సంకల్పయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ శాలువా కల్పి సత్కరించారు. ఈ సందర్భంగా అస్సా సీఎం మాట్లాడుతూ రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన పార్టీ రాబోయే ఎన్నికల్లో 17 కు 17 స్థానాల్లో గెలువడమే లక్ష్యంగా విజయసంకల్పయాత్ర జరుగుతోందన్నారు.రాష్ట్రంలోనియువత, విద్యార్థులు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందతా నరేంద్రమోడీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

బీజేపీని ఆదరించడండీ, మోడీ నాయకత్వానికి ఆశీస్సులు అందించండి అంటూ తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల విజయసంకల్పయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ , బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నరు.
