
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు వినతి
హైదరాబాద్, మార్చి01
బీసీలకు అత్యధిక పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బీజేపీ అధినాయకత్వాన్ని ఓబీసీ మోర్చా నెషనల్ మెంబర్ పెరిక సురేష్ కోరారు. ఈ మేరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 5 రిజర్వు స్థానాలు మినహా మిగిలిన 12 సీట్లలో 6సీట్లు బీసీలకు కేటాయించాలన్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో తమ సామాజిక వర్గం బలమైన వర్గంగా ఉందని ఈ స్థానంలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

ఈ పార్లమెంట్ స్థానంలో దశాబ్ధాలు ఒకే సామాజిక వర్గానికి అడ్డాగా మారిందన్నారు. అన్ని పార్టీలు ఇదే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇక్కడ బీసీ అభ్యర్థికి కేటాయిస్తే గెలుపు సులభం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నియోజవర్గంలోనే లక్షా 50వేల మంది పెరిక సామాజిక వర్గం ఉందని గుర్తు చేశారు. తమ సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ,ఎస్టీ సమాజిక వర్గాలు తమకు మద్దతు పలుకుతున్నాయని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించడం వల్లే ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక జనాభా కలిగిన బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీవర్గాలకు మెజార్టీ స్థానాలు కేటాయించాలని కోరినట్లు సురేష్ వెల్లడించారు.