‘ దీదీ’ అనగానే గుర్తొచ్చే పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశవ్యాప్తంగా దీదీగా పిలవబడే మమతాబెనర్జీ మరో దీదీని బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. బెంగాల్ లో రోజురోజుకి పెరుగుతున్న బీజేపి బలానికి అడ్డుకట్ట వేసేందుకు మమతా బెనర్జీ మరో దీదీని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. బెంగాల్ సీఎం దీదీ తీసుకొచ్చిన మరో దీదీ ఎవరు…?
పశ్చిమ బెంగాల్ లో దీదీ నెంబర్ 1 ఒక పాపులర్ టీవీ షో ప్రసారం అవుతుంది. ఆ పాపులర్ షో హోస్ట్ గా మన తెలుగు ప్రేక్షకులకు సుపరితురాలు అయినా నటి రచనా బెనర్జీ వ్యవహరిస్తున్నారు. సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి టివిపై దృష్టి పెట్టారు రచనా. బెంగాల్ లో పాపులర్ అయిన దీదీ నెంబర్ 1 షో ద్వారా చాలా కాలం నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలువురు ప్రముఖులను దీదీ నెంబర్ 1 షోకి పిలిచి ఇంటర్వ్యూలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రచనా. ఆ క్రమంలోనే బెంగాల్ దీదీగా పిలవబడే మమతా బెనర్జీని ఇటీవల దీదీ నెంబర్ 1 షోకి ఆహ్వానించి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ద్వారానే ఇరువురి మధ్య సఖ్యత ఏర్పడిండి.
బెంగాల్ సీఎం మమతని షోకి పిలిచేందుకు రచనా పలు విధాలుగా ప్రయత్నించారు. అప్పుడే రచనా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ పలు వార్తలు వచ్చాయి. వాటిని కొట్టిపారేస్తూ అలాంటిది ఏమన్నా ఉంటే తానే స్వయంగా చెబుతానంటూ రచనా బెనర్జీ మీడియాకి తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు అధికంగా వస్తున్నాయి. ఆ క్రమంలో బెంగాల్ లో బీజేపీని నిలువరించేందుకు మమతాబెనర్జీ లోక్ సభ ఎన్నికల్లో కొత్త వారిని నియమించాలని అనుకున్నారు. అందులో భాగంగానే హుగ్లీ లోక్ సభ స్థానం నుంచి రచనా బెనర్జీని నియమిస్తూ మమతా ప్రకటించారు.
హుగ్లీ లోక్ సభ స్థానంలో రచనాకి ప్రత్యర్థిగా మరో నటి లాకెట్ చటర్జీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రచన, లాకెట్ ఇరువురు సైతం చాలా సంవత్సరాలు సినీ పరిశ్రమలో సహచరులే. ఈ ఇద్దరు పలు సినిమాల్లో కలిసి పని చేసారు. రచనా వ్యక్తిగత విషయానికి వస్తే 1970 అక్టోబర్ 2న ఆమె జన్మించారు. 1990లో ఇంటర్ చదువుతున్నప్పుడు మిస్ కోల్ కతా టైటిల్ గెలుచుకున్నారు. 1994 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావటంతో సినీ పరిశ్రమలోకి వచ్చారు. రచనా బెనర్జీ పలు తెలుగు సినిమాల్లో కూడా పని చేసారు. కన్యాదానం అనే మూవీతో తెలుగు పరిశ్రమకు రచనా పరిచయం అయ్యారు. ఆ తరవాత వరుసగా చిరంజీవి, మోహన్ బాబు, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర నాయకులతో కూడా పని చేసారు.