మోదీ లక్షలకోట్ల సంపదను సంపన్నులకు పంచారు
మేము పేదలకు పంచుతాం
బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు
రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయి
ప్రజల గుండె చప్పుడైన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
మోదీ 22మంది కోసం పని చేసేశారు
మోదీ 16లక్షల కోట్లు కోటీశ్వరులకు మాఫీ చేసిండు
పేదల కోసం ఏం చేయలేదు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
పేదలకు అండగా నిలుస్తుంది
దేశంలో తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తాం
రైతులకు రుణమాఫీ, మద్దతు ధర కల్పిస్తాం
హైదరాబాద్,
మోదీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఆదానీ, అంబానీ వంటి కోటీశ్వరులకు పంచితే మేము అధికారంలోకి వచ్చాక పేదలకు పంచుతామనీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. గురువారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై య్యారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మరోసారి అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని అంటున్నరు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తోంది. భారత రాజ్యాంగం కేవలం పుస్తకమే కాదు.. అది పేద ప్రజల గొంతుక, గుండె చప్పుడు.. రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయి. రాజ్యాంగం ద్వారానే పేదలకు అధికారం. రిజర్వేషన్లు వచ్చాయి.. రాహుల్, రేవంత్ మాలాంటి వాళ్ళం అంతా మీఅండదండలతో రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాదుకుందామని పిలుపునిచ్చారు.
మేధావులు, మహామహులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు తమ చెమటను, రక్తాన్ని దారపోసారు. ప్రపంచంలో ఎవ్వరూ మన రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు.. దీని కోసం మేమంతా పోరాడుతాం…అదానీ, అంబానీ లాంటి 22 మంది కోసం మోదీ పని చేశారు. మోదీ ప్రజలు, రైతులు, కార్మికుల కోసం ఏ పని చేయలేదు..ప్రజలకు చెందిన లక్షల కోట్ల సంపదను 22 నుంచి 25 మంది పెట్టుబడి దారులకు మోదీ పంచారు.
లక్షల కోట్ల సందదను సంపన్నులకు పంచారు..
మోదీ ఇన్ని రోజులు ప్రజల డబ్బులను అంబానీ, ఆదానీ వంటి పెట్టుబడిదారులు, కోటీశ్వరులకు ధనికుల పంచారు. వాళ్లు ధనికులకు ఇస్తే మేం పేదలకు , రైతులకు, నిరుద్యోగులకు పంచుతాం. కటాకట్ కటాకట్ అంటూ వారి ఎకౌంట్లలో డబ్బులు పడతాయి. మోదీ 16లక్షల కోట్లు కోటీశ్వర్లు,పెట్టుబడి దారులకు మాఫీ చేసినప్పుడు మీడియా ప్రశ్నించలేదనీ, అదే మేము పేదలకు ఇస్తానంటే ఉచితాలంటూ ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో సంపదకు కొదవలేదు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..కాంగ్రెస్ పార్టీ పేదలను లక్షాధికారులను చేస్తుంది.
అధికారంలోకి వస్తాం..పేదలందరినీ ఆదుకుంటాం..
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే…ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలో రాగానే తెలంగాణ ప్రజలతో పాటు దేశంలోని ఉత్తరప్రదశ్, బీహార్ ఇలా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పేదల లిస్ట్ అంతా తయారు చేస్తాం. ప్రతి పేద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు వారి బ్యాంకు ఎకౌంట్లో వేస్తాం. ప్రతి కుటుంబానికి నెలకు రూ.8500 చొప్పున అందుతుంది. ఈ డబ్బులతో దేశంలోని ప్రజలందరీ జీవితాలు బాగుపడుతాయి. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తాం. రైతుల పంటల కోసం మద్దతు ధర లభించడం లేదు. రైతులు పండించిన పత్తి, వరి, ఇలా పంటలన్నింటీకీ మద్దతు ధర కల్పిస్తాం. రైతుల కష్టానికి ఫలితాన్ని అందిస్తాం. రైతు రుణాలు మాఫీ చేస్తాం. రైతుల కోసం పని చేయడానికి మేనిఫెస్టోలో తప్పుడు నిర్ణయాలతో మోదీ నిరుద్యోగం పెంచారు. నిరుద్యోగులకు అప్రెంటిషిప్ కల్పిస్తాం. గ్రాడ్యుయేషన్, డిప్లొమ చేసిన విద్యార్థులకు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తాం. ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్లలో యూనివర్సిటీ, హాస్పిటల్ లలో ఉపాధి అందిస్తాం. ఏడాది శిక్షణ కల్పించి ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తాం. వారి బ్యాంకు ఎకౌంట్లలో కటాకట్ పైసలు అందుతాయి. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలీ రూ.250ని మేము అధికారంలోకి వచ్చాక రూ.400లకు పెంచుతాం.. అంగన్వాడీలో పని చేసే వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. తాము పేదలకు, వెనుకబడిన వర్గాలకు కోసం పని చేస్తాం.
దేశంలో తెలంగాణ తరహా అన్ని పథకాలు అమలు చేస్తాం.
దేశంలో తెలంగాణ తరహా అన్ని పథకాలు అమలు చేస్తాం. కులగణన నిర్వహిస్తాం. కులగణన చేస్తే ఎవరు ఎంతమందో తేలుతుంది. అన్ని వర్గాలకు వారి జనాభా ప్రకారంప్రాధాన్యత కల్పిస్తాం. దీంతో దేశ రాజకీయాలు మారిపోతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీమ్ ఇప్పటికే 30వేల ఉద్యోగాలు కల్పిచింది. పేద మహిళలకు రూ.500 గ్యాస్ అందిస్తోంది, రూ.10లక్షల ఆరోగ్యశ్రీ అందిస్తోంది. మహిళకు ఫ్రీ బస్, పేదలకు 200యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తోంది. ఇవే హామీలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తాం..అని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ట్రాన్స్లేషన్కా జరూరీ హే..హిందీ చలేగా..అంటూ సభికులను కోరగా..చలేగా అనడంతో హిందీలోనే రాహుల్ ప్రసంగాన్ని కొనసాగించారు. జై హింద్..జై తెలంగాణ అంటూ అంటూ రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు.