అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు ప్రమాదంలో ఉంది
లోక్ సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లూ ప్రమాదంలో పడ్డాయి
బీజేపీపై రాహుల్ యుద్ధం ప్రకటించారు
తెలంగాణ ప్రజలంతా అండగా నిలువాలి
కాంగ్రెస్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది
బీజేపీ విశ్వనగరంపై విషం చిమ్ముతోంది
బీజేపీ మత విధ్వేశాలు రెచ్చగొడుతోంది
వారి ఉచ్చులో ప్రజలు పడొద్దు
బీజేపీ ఎంపీ 15సెకన్లు ఇస్తే మైనార్టీలను తుదముట్టిస్తామంది
బీజేపీ ఎంపీపై ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేయాలి
జనజాతర సభలో సీఎం రేవంత్రెడిడ
హైదరాబాద్,
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్‌లో జరిగిన జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ… 18వ లోక్ సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్యగా మారింది. బాబాసాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లు హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఈ రోజు కంకణ బద్దులై బయలుదేరారని విమర్శించారు.
1980లో జనతా ప్రభుత్వం సంక్షేభసమయంలో ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికల బరీలో దిగి వారిని ఒడించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందన్నారు. తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఇక్కడ ఎంపీగా ఉన్నారనీ, తన చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసం అంకితం చేశారనీ గుర్తు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీ నేతలపై ఇందిరమ్మ మనవడు యువనేత రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని సీఎం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రిజర్వేషన్లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు..రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రిజర్వేషన్లను రక్షించేందుకు తెలంగాణ గడ్డ పై నుంచే యుద్ధం ప్రకటించారని అన్నారు. ఈయుద్ధంలో తెలంగాణ సమాజం రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. 60ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చింది. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచి రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మత విధ్వేశాలు రెచ్చగొడుతున్నరు..
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అమిత్ షా మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారనీ, రిజర్వేషన్లు రద్దు చేసి, దేశాన్ని దోచుకోవాలన్న బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని సూచించారు. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుందనీ. మన్మోహన్సింగ్ ప్రభుత్వం హాయంలో హైదరాబాద్ నగరానికి అవుటర్ రింగ్‌రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రోరైల్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేశారని అన్నారు. కృష్ణా జలాలను, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడారని గుర్తు చేశారు. అందుకే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు , లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వచ్చాయని అన్నారు.
బీజేపీ ఎంపీ ఒకరు హైదరాబాద్‌కు వచ్చి 15సెకన్లు ఇస్తే దేశంలో మైనార్టీలను తుదముట్టిస్తామని మత విధ్వేశాలు రగిలిచిందని, పౌర సమాజం జాగృతంగా ఆలోచించాలి. ఇలా చేస్తే మనకు పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకోవాలనే బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని అన్నారు. మత సామరస్యం కాపాడాం, పరిశ్రమలు, ఐటీ, ఫార్మా కంపెనీలు తెచ్చామనీ అందుకే విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ విశ్వ నగరంపై బీజేపీ విషం చిమ్ముతోందని ఆరోపించారు. బీజేపీ మతం చిచ్చు పెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తోందనీ, బీజేపీ ఉచ్చులో పడొద్దునీ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు మనం శ్రీరామనవమి చేయలేదా.. హనుమాన్ జయంతి చేయలేదా.. మన తాతముత్తాతలు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ పూజలు చేయలేదా..కోడిని కొయ్యలేదా కల్లును పొయ్యలేదా అని రేవంత్రెడిడ ప్రశ్నించారు. మనకా వీళ్లు హిందుత్వం గురించి నేర్పేది. అయోధ్యలో రాములవారి ప్రతిష్ట జరుగముందే అక్షింతాలు 15రోజుల ముందే పంపించి బీజేపీ వాళ్లు ఓట్ల కోసం బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలనీ రేవంత్ హితవు పలికారు. హిందూ ముస్లీం సోదరులకు ఒకటే చెబుతున్నా బీజేపీ మత చిచ్చు ఉచ్చులో పడొద్దు..శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై అవసరం ఉందని రేవంత్ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యురాలిపై తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలనీ, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా, మోదీలను ఒక్కటే అడుగుతున్నా అంతుచూస్తామన్నా ఎంపీని సమర్థిస్తారా లేక పోతే ఆమెను వెంటనే బహిష్కరించాలన్నారు.
మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే..
బీజేపీ తెలంగాణకు ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప ఏం లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోనియాగాంధీ బయ్యారంలో ఉక్కుకర్మాగారం ఇస్తే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. సోనియాగాంధీ ఐటీఐఆర్ కారిడార్ ఇస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు అని ఎద్దేవా చేశారు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని అభ్యర్థించారు. బీజేపీకీ ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్లే..రిజర్వేషన్లు రద్దు చేసినట్లేనని అన్నారు. రాహుల్ గాంధీ మంచుటెండల్లో మండుటెండల్లో పాదయాత్ర చేసి, తాడిత పీడిత జనాలను కలుస్తూ దేశంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నరనీ ఆయనకు అండగా నిలువాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ రేవంత్‌రెడ్డి కోరారు.