
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మే 11వ తేది సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ని దృష్టిలో ఉంచుకుని అందరూ సహకరించాలని కోరారు. ఆంక్షలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో మే 13న 17 పార్లమెంటు స్థానాల ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రమంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర బలగాల సహకారంతో అన్ని జిల్లాలకు సెక్యూరిటీని మోహరించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. హింసాత్మక పార్లమెంటు స్థానాల్లో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసేందుకు ఈసీ తగిన చర్యలు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో జరిగే ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలంటూ షాపు ఓనర్లకు ఆదేశాలు పంపారు. వైన్స్ తో పాటు బార్లు, కళ్ళు కాంపౌండ్ లాంటివి ఏవి కూడా రెండు రోజుల పాటు తెరవటానికి వీలు లేదు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసి ఈ నిర్ణయం తీసుకుంది. కానీ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే డబ్బును, మద్యాన్ని లోకల్ లీడర్లకు పంచేసి వుంటారు. ఎన్నికలు అంటేనే మద్యం ప్రవాహంలో ఓటర్లను ముంచి డబ్బులను విరివిగా పంచి ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్న నేపథ్యంలో ఈలోపే కొనుక్కుని పెట్టుకుంటారు. ఓటర్లలో మార్పు రానంతవరకు రాజకీయ నాయకులు ఓట్లను మద్యం, డబ్బులతో కొంటూనే వుంటారు.
