
సీఎండీ రోనాల్డ్ రోస్కు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ వినతి
హైదరాబాద్, జులై 22: విద్యుత్ సంస్థల్లో దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లా యీస్ జేఏసీ కోరింది. ఈ మేరకు సోమవారం ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రోనాల్డ్ రోస్ ని జేఏసీ నేతలు శివాజీ, పి.అంజయ్య, ప్రకాష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏడేండ్లు గా ప్రమోషన్లు లేకుండా ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారని.. వారి పరిస్థితి దయనీయం గా ఉందని సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అవకాశాలున్నా ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కేసుల వల్ల కొంత మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఆగిపోయా యని తెలిపారు. సీఎండీ చొరవ తీసుకుని ఖాళీలను షరతులతో అయినా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. దీనిపై సీఎండీ రోనాల్డ్ రోస్ స్పందిస్తూ త్వరలో ప్రభుత్వం దృష్టికి ప్ర మోషన్ల సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నార్తర్న్. డిస్కం సీఎండీ కర్నాటీ వరుణ్ రెడ్డి, విద్యుత్ జేఏసీ నాయకులు రామేశ్వర్ శెట్టి, నాజర్ షరీఫ్, రామకృష్ణారెడ్డి, రాజు, వెంకటేశ్వర్లు, పరమేష్ ,రాజేష్ వెంకటరమణ, అనిల్, లక్ష్మయ్య, సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.