
ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ జేఏసీ వినతి
హైదరాబాద్, జూలై 22: సీనియార్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కమ్ మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ప్రతినిధి బృందం ట్రాన్స్కో సీఎండీ రోనాల్డ్స్ ను కలిసి వినతిపత్రం అందించింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ శ్యాంమనోహ ర్, కో చైర్మన్ నారాయణ నాయక్, కో కన్వీన ర్ మేడి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కొందరు ఎస్సీ, ఎస్టీలల్లో గందరగోళాన్ని సృష్టించి… ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తు న్నారని ఆరోపించారు.రాజ్యాంగం ప్రకారం.. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ ఉత్తర్వుల మేరకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.