
ఫోటో..మంద కృష్ణకు అభినందలు తెలిపిన బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, ఆగస్టు 04
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముప్పై ఏళ్లుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పుగా అభివర్ణించారు. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల పెరిక సురేష్ హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ పోరాటానికి తమ వంతు సహకారం అందించినట్లు చెప్పారు. 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందనీ, సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందన్నారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్నారని సురేష్ తెలిపారు.