
*7ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం
*సీఏం,డిప్యూటీ సీఎం,సిఎండి ఫ్లెక్సీ కి పాలాభిషేకం
హైదరాబాద్, ఆగష్టు 18
సదరన్ డిస్కంలో గత ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు ఎట్టకేలకు మోక్షం లభించినట్లయింది. డిస్కం చరిత్రలో మొదటిసారిగా ఒకే రోజులో 2263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేసారు. ఇంజినీరింగ్ సర్వీస్ లో 101, అకౌంట్స్ సర్వీస్ లో 47, ఓఅండ్ఎంలో 2099, పీఅండ్ జీ సర్వీస్ లో 16 మంది అధికారులు, సిబ్బందికి ప్రమోషన్లు లభించాయి.
ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షా లో పలువురు అధికారులు పెండింగ్ ప్రమోషన్లను దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ సీఎం స్పందించి ప్రమోషన్లు ఇవ్వాలని సీఎండీని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సీఎండీ ప్రమోషన్లకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఈ నుంచి సీఈకి ఇద్దరు, డీఈ నుంచి ఎస్ఈకి 8మంది, ఏడీఈ నుంచి డీఈకి 30మంది, ఏఈ నుంచి ఏడీఈకి 58మంది, జేఎల్ఎం నుంచి ఏ ఎల్ఎంకు 1650మంది, అకౌంట్స్లో జీఎం నుంచి సీజీఎంలుగా ఇద్దరు, ఎస్ఏఓ నుంచి జీఎంగా ఇద్దరు, పీఅండ్ జీ జీఎం నుంచి జాయింట్ సెక్రటరీగా ఒక్కరికి ప్రమోషన్లు దక్కాయి. 2263 మందికి ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీలను భర్తీ కి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు.

తాజా నిర్ణయంతో ఉద్యోగులు సీఎం, డిప్యూటీ సీఎంల సీఏం, సీఏండీ ఫ్లెక్సీ కి పాలాభిషేకం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఈఈ జేఏసీ కోఛైర్మన్,విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంజయ్య, కో కన్వీనర్ పరమేశ్వర్ శెట్టి, నాజర్ షరీఫ్ ,కరెంట్ రావు, లక్ష్మయ్య ,శ్యామలరావు మధు, ప్రవీణ్ హరీష్ కుమార్, సత్యనారాయణ ప్రసాద్, పవర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు