
డిజిటల్ కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేయండి
కేబినెట్ సబ్ కమిటీకీ సీఎం పలు సూచనలు
సెక్రటెరియట్లో మంత్రులు, అధికారులతో సీఎం సీమక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 19: రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు2 నుంచి అప్లీకేషన్లు స్వీకరించాలని సీఎం సూచించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సెక్రటెరియట్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో పాటు సీఎస్ శాంతికుమారీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిటీకి సీఎం పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేవిధంగా ప్లాన్ చేయాలని సూచించారు. ఇదే అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీలు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, అగ్రికల్చర్ సెక్రటరీ ఎం.రఘునందన్‌రావు, సివిల్ సప్లయ్స్ సెక్రటరీ డి.ఎస్.చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.