
హైదరాబాద్ సెప్టెంబర్ 27
జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర శుక్రవారం రోజున రిలీజ్ అయిన నేపథ్యంలో హైదరాబాదులో RTC క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్ థియేటర్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ప్రమాదానికి గురై కాలిపోయింది ఎందుకు కాలిపోయింది ఎలా కాలిపోయింది అనే వివరాలు తెలవాల్సి ఉంది భారీ ఎత్తున జనాలు ప్రేక్షకులు థియేటర్లకు కదిలి వచ్చిన నేపథ్యంలో తాజాగా సినిమా హాల్ థియేటర్ వద్ద భారీ కటౌట్ కాలిపోవడం అనుమానాస్పదానికి దారితీసింది. సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చిన సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది… చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

