
గద్వాల అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా
గద్వాల, అక్టోబర్ 20
రైతు బంధు ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా.కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ…..కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు రూ.10,000 లు మాత్రమే ఇస్తున్నాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.15,000/- ల రైతు బరోసా పేరుతో ఇస్తామని అదేవిధంగా ఒకే సారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీనిలో భాగంగానే నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతు బంధు ఉండదు అని చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఏవిధంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు రూ.15,000/- ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అతి గతి లేదన్నారు..అదేవిధంగా భూమి లేని ఉపాదిహమీ రైతుకూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు ఇస్తామని చెప్పి పేదవారిని మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.

స్థానిక ఎమ్యెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గుర్తుమీద కేసీఆర్ దయతో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి బొక్కలకు ఆశపడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడని ఆరోపించారు.
వరికి మద్దతు ధర తోపాటు బోనస్ ఇవ్వాలని రైతు భరోసా వెంటనే ఇవ్వాలని రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు
ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల. మత్తాలి,ప్రతాప్ రెడ్డి,రవి,నీలిపల్లి నరసింహ,తిరుమలేష్,కుర్వపల్లి వెంకటన్న,మల్దకల్ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.