హర్షం వ్యక్తం చేసిన పెరిక సురేష్
హైదరాబాద్, డిసెంబరు 09
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ హర్షం వ్యక్తం చేశారు.బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు పార్టీ సముచిత గౌరవాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు. బీసీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం ఆయన విశేష కృషి చేశారని, బీపీ మండల్, జ్యోతిబా ఫూలేలాంటి గుర్తింపు ఉందని కొనియాడారు. ఆర్ కృష్ణయ్య గత 40ఏళ్లుగా బీసీల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు విశేష ఆదరణ ఉందనీ, కృష్ణయ్య లాంటి అట్టడుగు వర్గాల నాయకుడిని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టి ప్రశంసనీయ నిర్ణయం తీసుకున్నదని బీజేపీ నాయకత్వానికి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.