ఏపీ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరిస్తున్న పెరిక సురేష్
హైదరాబాద్, డిసెంబరు 11
టీటీడీ ఆధ్వర్యంలో థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని ఏపీసీఎం చంద్రబాబు నాయుడును కోరినట్లు నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేశ్ తెలిపారు. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వెలిబుచ్చారు. థార్మికభావం కలిగి స్వచ్చందంగా శ్రీవారిని సేవించేందుకు వచ్చే వారికి సేవచేసుకునే అవకాశాలు కల్పించాలన్నారు.
స్వచ్చందంగా విరాళంగా తన వంతుగా స్వామివారికి తిరుమలలో పది కాటేజీలను నూతనంగా నిర్మించినట్లు తెలిపారు. గత కొన్నేళ్లులుగా నిలిచిపోయిన థార్మిక కార్యక్రమాలను తిరిగి పునరుద్దరించాలని కోరారు. భక్తుల నుంచి వచ్చే విరాళాలను హిందువులకే ఖర్చు చేయాలని కోరారు.
అన్యమత ప్రచారాలను జరగుకుండా చర్యలుచేపట్టాలన్నారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామిని సందర్శించే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పెరిక సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సురేష్ చంద్రబాబు పుష్ఫగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.