
హైదరాబాద్ లో పెందుర్తి వెంకటేష్ కు ఘనసత్కారం
సత్కరించిన ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఈటల రాజేందర్
హైదరాబాద్, డిసెంబరు 24
అన్ని వర్గాల ప్రజలకు పెందుర్తి వెంకటేష్ చేసిన సేవలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇవ్వడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం కోఆర్డినేటర్గా నియమతులైన పెందుర్తి వెంకటేష్ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి, ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ , సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏ రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే పెందుర్తిని గుర్తించి కోఆర్డినేటర్గా నియమించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. గత రెండు దశాబ్ధాలుగా ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా పెందుర్తి వెంకటేష్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు.
