
ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ సురేష్
హైదరాబాద్, డిసెంబరు 25
భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్ పేయి అని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. బుధవారం వాజ్ పేయి శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాంచందర్రావుతో కలిసి మాజీ ప్రధాని వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషం. దేశ ప్రజలకు స్పూర్తి ప్రదాత వాజ్ పేయి. ప్రోక్రాన్ అణుపరీక్షలు, స్వర్ణ చతుర్భుజీ, గ్రామీణ సడక్ యోజన ఆయన చలువేనని అన్నారు. పార్లమెంట్ లో బలనిరూపణ విషయంలో అనేక మంది ఇతర పార్టీలో ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నీతి, నిజాయితీగా వ్యవహరించి పదవిని కోల్పోయిన మహనీయుడు వాజ్ పేయి అని కొనియాడారు.

వాజ్ పేయి అడుగుజాడల్లో ఆయన ఆశయాలను అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని కొనియాడారు. అనేక అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.