
హైస్కూల్ కురుమ పెళ్లి పందిరి ఆధ్వర్యంలో దీపావళి పురస్కరాలు
వరంగల్, డిసెంబర్ 29
కురుమలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయమూర్తి కంచ ప్రసాద్ అన్నారు. ఆదివారం వరంగల్లో బ్లూబెల్ హైస్కూల్ కురుమ పెళ్లి పందిరి ఆధ్వర్యంలో దీపావళి పురస్కరాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్ మాట్లాడుతూ కురుమ సమాజం గురించి తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను వివరిస్తూ కురుమ కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. కురుముల బాధలన్నీ తనకు తెలుసని వివరించారు. కురుమ సమాజానికి రాజకీయంగా న్యాయపరంగా రావాలసిన హక్కులకు దూరమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా అన్ని రంగాల్లో కురుమలు రాణించాలని తెలిపారు.


కార్పొరేటర్ మరుపల రవి మాట్లాడుతూ 1970 సెమి నోబాటిక్ ట్రైబ్స్(ఎస్ఎన్టీ)లో కురుమలు ఉన్నారు. 1970 తర్వాతే బీసీ బీలో చేర్చడంతో కురుమలు అన్ని రంగాలలో వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఎస్ ఎన్ టి సాధన కోసం ఉద్యమించాలన్నారు. ప్రతి కురుమ బిడ్డ అన్ని రంగాలలో ఎదిగి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిమిక్రీ కళాకారుడు నంది పురస్కార్ అవార్డు గ్రహీత రాగి దామోదర్ తన ధ్వని అనుకరణతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమ కన్వీనర్లు మాట్లాడుతూ కురుమ కులం అభివృద్ధి కోసం తామ చేసే కార్యక్రమాలకు కురుమలు సహకరించాలని ఈ సందర్భగా కోరారు.

ఈ కార్యక్రమానికి బ్లూబెల్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అజయ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ , కన్వీనర్లు మండల నరసింహా రాములు, ముదిగిరి ఓదేలు, అన్న రాజు, ముదిగిరి సమ్మయ్య, కంచ సంపత్, దండు కృష్ణ, సాగర్, మండల సీతారాములు, నరిగె శ్రీను, చిగిరి కుమారస్వామి, దయ్యాల సుధాకర్, గుండ ఎలేష్, జీనుక రవి పురస్కారం గ్రహీతలు కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.