
ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన దయ్యాల భాగ్య
సీఎం రేవంత్ రెడ్డికి భాగ్యను పరిచయం చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మురళీ నాయక్
హైదరాబాద్, డిసెంబర్ 30
ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన దివ్వాంగురాలు దయ్యాల భాగ్యను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ లు భాగ్యను సీఎం రేవంత్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా దివ్వాంగురాలైన భాగ్య క్రీడా స్ఫూర్తిని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈనెలలో ఇండోనేషియలో అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు జట్టు విజయంలో కీలపాత్రపోషించిన భాగ్యకు తగిన గుర్తింపు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దివ్వాంగురాలైన భాగ్యకు ఉద్యోగంతో పాటు సాధ్యమైయ్యే ఇతర ప్రభుత్వ సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం కురుమవాడకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన దయ్యాల భాగ్య పుట్టుకతోనే దివ్వాంగురాలు ఇటు చదువుల్లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఫోక్ ఆర్ట్స్లో పీజీ పూర్తి చేసింది. త్రోబాల్ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలతో పాటు అంతర్జాతీయ స్థాయి రాణిస్తోంది.
ఇదే డిసెంబర్ నెలలో ఇండోనేఇషయిలో పారా త్రోబాల్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల గూడురులో జరిగిన దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మురళీ నాయక్లకు దృష్టికి రాగా సీఎం రేవంత్రెడ్డికి కలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు సోమవారం భాగ్య క్రీడా నైపుణ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.