35శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికే: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసెంట్రల్ స్కీమ్లున్నీ అమలు చేస్తాం..:అగ్రిసెక్రటరీ రఘునందన్‌రావు
హైదరాబాద్, జనవరి 03
అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంక్రాంతి కంటే ముందే ప్రమోషన్లు కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరో ఒకరు చేసిన చిన్న తప్పుకు ఇంతమంది వ్యవసాయశాఖ ప్రమోషన్ల కోసం ఇన్నాళ్ల నీరీక్షణ బాధ కలుగుతుందన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల సమస్యలన్నింటీని నెరవేరుస్తామని ప్రకటించారు. శుక్రవారం అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయం..ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా…కోటి సమస్యలున్నా సరే రైతును నిలబెట్టాలనేదే ప్రభుత్వ లక్ష్యం.. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..తెలంగాణ ఖ్యాతీ, కీర్తి ప్రతిష్టలు దేశానికి చాటాలనేది సీఎం రేవంత్‌రెడ్డి కోరిక.. గతంలో జరిగిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఎంత వీలయితే అంతా శక్తి మొత్తాన్ని వ్యవసాయ రంగానికే వాడాలనేది ప్రభుత్వ ఆలోచన అని తుమ్ముల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు అగ్రికల్చర్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయి. రైతు చుట్టూనే అన్ని శాఖలు తిరుగుతూ ఉన్నాయి. పద్దతిగా ఉంటే రాష్ట్రాన్ని దేశాన్ని సుభిక్షంగా ఉండేలా చెయొచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ఱభుత్వం గత బడ్జెట్లో 35శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికే కేటాయించిందని గుర్తు చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రుణమాపీ, రైతు భరోసా ఇతర స్కీములన్నీ అమలు చేస్తున్నాం. రుణమాఫీలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనీ, రైతుల్లో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా చేయాలంటే అగ్రికల్చర్ ఉద్యోగులు సహకరించాలని కోరారు. రైతు భరోసాతో రైతు అవేర్నెస ప్రోగ్రామ్‌లలో అగ్రికల్చర్ ఆఫీసర్లతో పాటు రెవిన్యూ సెక్రటరీలు సహకరించేలా, వారి స్టాఫ్‌ను వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు టెక్నాలజీపై అవగాహణ కల్పించి వ్యాల్యూ ఎడిషన్ చేయాలని సూచించారు.
సెంట్రల్ స్కీమ్లున్నీ అమలు చేస్తాం..: రఘునందన్‌రావు
గత ఐదారు ఏళ్లుగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి పూర్తిగా అమలు చేస్తామని అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద స్కీమ్‌లన్నీ అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. ఫామ్ మెకనైజేషన్, పీఎం కిసాన్, డ్రిప్, పీకే వీవై, ఆయిల్‌పామ్, ఆర్కేవీవై తదితర సెంట్రల్ స్కీమ్‌లన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారుల ప్రమోషన్లు, వెయికిల్ అలవెన్స్‌లు తదితర సమస్యలను వారం రోజుల్లో ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్లలో ఫోన్ బేస్డ్ సూపర్ విజిన్ పెరిగిపోయిందనీ, రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జరిగే అన్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్‌లో భాగస్వామ్యం కావాన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు లేటెస్ట్ డెవలప్మెంట్ టెక్నాలజీలపై అప్ డేట్ కావాలన్నారు. విధుల్లో టెక్నాలజీ వినియోగం పెరగాలని సూచించారు.వందశాతం కమిట్మెంట్ తో పని చేయాలని, ప్రభుత్వం వేరు వ్యవసాయశాఖ వేరు అన్నట్లు వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎండీ కె రాములు పాల్గొన్న ఈ సమవేశంలో గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు కల్పించాలని, వెయికిల్ యెలవెన్స్ ఇయర్లీ ప్రొవిజన్ కల్పించాలని సంఘం అధ్యక్షుడు సల్మాన్ నాయక్, తిరుపతి నాయక్ కోరారు.