
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వేతన నిబంధనలు అమలు చేయాలి; జేఏసీ
హైదరాబాద్, జనవరి 05,2025
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనీ ,సుప్రీంకోర్టు వేతన నిబంధనలు అమలు చేయాలనీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్ కాదనీ స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి రెగ్యులరైజ్ చేయడం కుదరదనీ, శాఖా పరమైన న్యాయపరమైన అడ్డంకులు తలెత్తుతాయని ఇచ్చిన సందేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ, సంస్థలు పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ లక్ష 50 వేల మంది కుటుంబాలు తీవ్ర మనోవేదన గురయ్యాయనీ ఆవేదన వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి మాపై యందు దయతలిచి మేం కూడా మీ ప్రజా పాలనలో పనిచేస్తున్న ఉద్యోగులమే ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఉద్యోగులమే మా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఏజెన్సీ వ్యవస్థ రద్దుచేసి నేరుగా మా ఖాతాల్లో జీతాలను వచ్చే విధంగా,పే స్కేల్ ఇప్పిస్తే సరిపోతుందని మా యొక్క విన్నపం.. అంటూ పేర్కొన్నారు. రెగ్యులరైజేషన్ చెయ్యమని ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కోరలేదు. మా డిమాండ్ కూడా అది కాదు.. మా న్యాయమైన డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పిస్తే మా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయనీ జేఏసీ నేతలు పేర్కొన్నారు..
వెట్టి చాకిరి బానిసత్వపు పోకడలకు బలికాకుండా ఉంటామని , ముఖ్యమంత్రినీ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ప్రాధేయ పడుతున్నామనీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పుల్లగుర్లరాజారెడ్డి, సిద్దిపేట జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ ప్రెసిడెంట్ పోనమల్ల యాదగిరి , ప్రధాన కార్యదర్శి పోతుల రాజమల్లు, రాష్ట్ర జేఏసీ జాయింట్ సెక్రెటరీ మునిగంటి జగదీష్, డిగ్రీ కాలేజ్ నేతలు తలారి రామచంద్రం , కపిల్ రెడ్డి, మధు, రవి, ప్రకాష్,బిక్షపతి కుమారస్వామి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.