
హైదరాబాద్, ఫిబ్రవరి 01
హైటెక్స్లో జరుగుతున్న క్వెస్ట్ ఏసియా 2025 ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ ఐటీ హబ్గా మారిన నేపథ్యంలో కార్పొరేట్ గిఫ్టింగ్ కల్చర్ పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 500లకు పైగా సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలు, 2400లకు పైగా ఫార్మా కంపెనీలు, ల్యాబ్లు, బ్యాంకింగ్ తదితర మల్టీనేషనల్ కంపెనీలు, ఇండస్ట్రీలు ఉన్న నేపథ్యంలో కార్పొరేట్ గిఫ్టింగ్ ఇండస్ట్రీ వందల కోట్ల బిబిజెన్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గిఫ్టింగ్, స్టేషనరీ, హోం డెకోర్, హ్యాండీక్రాఫ్ట్ తదితర వస్తువుల ప్రదర్శన ఫిబ్రవరి 2 వరకు నిర్వహిస్తున్నారు..

హ్యాండీ క్రాఫ్ట్లలో వెదురు వినియోగం అన్ని వస్తువుల తయారీలోనూ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత తక్కువ ధర నుంచి ఖరీదైన వస్తువుల వరకు ఈ ఎగ్జిబిషన్లో విక్రయాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ , లెదర్, ట్రావెల్ బ్యాగ్స్, టీషర్ట్స్, స్మార్ట్ వాచ్లు, స్టోరేజ్ గిఫ్ట్ లు, స్కూల్, ఆఫీస్ స్టేషనరీ డెకోరేటీవ్ ఐటమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చి వచ్చాయి. ఈ ఎగ్జిబిషన్ ‘సాఫ్ట్వేర్ నిపుణులు, ఎంఎన్సీల ప్రతినిధులతో పాటు సాధారణ ప్రజల వరకు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.


లైఫ్ స్టైల్, హెల్త్కేర్ ప్రాడక్ట్స్ అందుబాటులో ఉన్నాయనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండెట్ వస్తువులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయనీ ఎక్స్పో గైలాక్సియా ఫౌండర్ డైరెక్టర్ రాఖీ ముఖర్జీ వివరించారు.