
హైదరాబాద్, ఫిబ్రవరి 02
నెక్లెస్ రోడ్ పీపుల్స్ రాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళాకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు హార్టికల్చర్ షోకు చేరుకున్నారు వివిధ రకాల పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్టికల్చర్ , అగ్రికల్చర్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
ఆకట్టుకున్న హార్టీ కల్చర్ ఉత్పత్తులు..
ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్‌షో ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన లో వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, ఉత్పత్తులు ఈ ప్రదర్శన లో ప్రత్యేకంగా నిలిచాయి. కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్ ,ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్రదర్శించారు.


దేశవ్యాప్తంగా డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మొక్కలు 150స్టాల్స్ కొలువుదీరాయి బోన్సాయ్ వృక్షాలు, పూలు, పండ్ల మొక్కలు అబ్బుర పరుస్తున్నాయి. గార్డెనింగ్‌బీజీగా ఉండే షో ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్‌అన్నారు. సోమవారం వరకూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ షో జరుగుతందని తెలిపారు. ఈ షో లో మెడిసినల్ ప్లాంట్స్, రకరకాల పండ్లు, పూల మొక్కలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్‌కు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. మెడిసినల్ ప్లాంట్స్ , ఫ్రూట్, ఫ్లవర్‌ప్లాంట్స్, బల్బ్స్ ప్రదర్శించారు.


