
- అత్యున్నత కమిటీలో కంచె ఐలయ్యకి చోటు
లోకసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు… తెలంగాణ అభివృద్ధి, ప్రజా పాలన, తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీలో ప్రొ. కంచె ఐలయ్యతో పాటు యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్ దేవ్ తొరట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొ. భూక్యా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్లానింగ్, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన పనిచేస్తుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా కులగణన తెలంగాణ ప్రభుత్వం చేసింది కనుక లెక్కల ఆధారంగా తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం అన్ని రంగాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకున్నట్లు తెలిసింది.