
జనగామ జిల్లా డిఐఈఓ జితేందర్ రెడ్డి
వంద శాతం ఉత్తీర్ణత సాధించేల కృషి చేయాలి
కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి
జనగామ, ఫిబ్రవరి 25,2025

విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో పాటు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలనీ జనగామ జిల్లా డిఐఈఓ జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో,సమయపాలన పాటిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచు కోవాలన్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలపై దృష్టి పెట్టి, సబ్జెక్టుల వారిగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, భయాందోళనకు గురి కాకుండా, ప్రశాంతతతో పరీక్షలు రాయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు ఎప్పుడు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఉత్తీర్ణత కోసం అధ్యాపకులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్ బోర్డు పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వస్కుల శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, కాపర్తి శ్రీనివాస్, మహమ్మద్ ముక్తాదిర్, షహనాజ్ తారనం, సబిహా బేగం, తిరుమలేష్, శంకర్,,, ఇశ్రాత్ భాను, రేఖ, సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, మధు, సురేష్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

