
మహాకుంభమేళాలో 45రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాం
అఖిల భారత ధర్మాచార్య పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిక సురేష్
హైదరాబాద్, ఫిబ్రవరి 27
మహాకుంభమేళాలో 45రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు అఖిల భారత ధర్మాచార్య పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిక సురేష్ వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రయాగ్రాజ్లోని శ్రీవేణి సంగమంలో మహాకుంభమేళా ఆరంభం నుంచి మహాశివరాత్రి వరకు నిత్యన్నధానాలు, వసతి, వైద్యసేవలు, స్వామిజీలతో భాగవత గోష్టిలు నిర్వహించామని తెలిపారు.


తన నేతృత్వంలో 270 కుటీరాలు ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా ఉచిత వసతి కల్పించామన్నారు. తెలంగాణ నుంచి అత్యధికంగా నల్గొండ నుంచి 20వేల మందికి సవతి కల్పించామని తెలిపారు, ప్రతీ రోజుకు 2వేల మందికి అన్నధానకార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రముఖ స్వామీజీ శ్రీరాం భద్రాచార్యులతో పాటు, వీరేంద్ర శాస్త్రీ , జగద్గురు శంకరాచార్య అనంత శ్రీభూషీత్ శంకరాచర్య స్వామీజీల, స్వామి విమల్దేవ్ లతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అఖంఢ దీపోత్సవాలు, శివపూరణ, నిత్యాభిషేకాలు వంటి దైవ కార్యక్రమాలు నిర్వహించినట్లు సురేష్ వివరించారు. గతంలో ఆయోద్యలో 11రోజుల పాటు యాగంలో పాల్గొన్న స్ఫూర్తితో ఈ 45రోజుల పాటు మహాశివుని సన్నిధిలో గడపడం తన పూర్వజన్మసుకృతమని పెరిక సురేష్ పేర్కొన్నారు.
