
ఐటిఐ, డిప్లొమా, బీటెక్ ఎలక్ట్రికల్ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ
అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ట్రైనింగ్ క్లాసులు
ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి
హైదరాబాద్, మార్చి 01,2025
రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ, డిప్లమా, బీటెక్ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ రంగంలో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రైవేట్ ఎలక్ట్రికల్ రంగంలో పనిచేయాలనుకునే వారికి మార్చి 3నుంచీ 12వ తేదీ వరకు మింట్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా వాళ్ళ పేర్లు అంబేద్కర్ భవన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
శిక్షణ పొందిన వారు ప్రైవేటు, సాఫ్ట్వేర్, ఇండస్ట్రియల్, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఉద్యోగావకాశాలు పొందడంతో పాటు గృహ విద్యుత్, ఎలక్ట్రికల్ వృత్తి నైపుణ్యం సాధించవచ్చన్నారు.ఈ అవశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని యాదగిరి తెలిపారు.శిక్షణపై మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్లు 9989892717. 8185851000 లను సంప్రదించవచ్చు.

