
ఆర్టీసీ ఎండీకి ఐఎన్టీయుసీ ఎస్ డబ్ల్యూ యు రాష్ట్ర కమిటీ అభినందలు
హైదరాబాద్, అక్టోబర్ 13
ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావాలని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం ఆర్టీసీ క్రాస్రోడ్లోని బస్ భవన్ లో ఐఎన్టీయుసీ ఎస్ డబ్ల్యూ యు రాష్ట్ర కమిటీ ప్రతినిధులు నూతనంగా బాధ్యతలు స్పీకరించిన ఆర్టీసీ వీసీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలపై ఐఎన్టీయుసీ ఎస్ డబ్ల్యూ యు ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఐఎన్టీయుసీ ఎస్ డబ్ల్యూ యు నాయకులు ఆర్టీసీ నూతన ఎండీకి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డిని ఐఎన్టీయుసీ ఎస్ డబ్ల్యూ యు రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమ్మద్, జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జక్కుల మల్లేశం, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు జయ,గర ఛాయాదేవి, శాంత కుమారి, , రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్సీకరించిన నాగిరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఐఎన్టీయుసీ ఎస్ డబ్ల్యూ యు రాష్ట్ర కమిటీ నాయకులు చిత్రంలో సయ్యద్ మహమ్మద్, రాజిరెడ్డి తదితరులు
