
రూ. 3.66 కోట్ల ప్యాకేజీతో గూగుల్ జాబ్ ఆఫర్!
2 గంటల్లో పాస్‌పోర్ట్…
ప్రైవేట్ జెట్‌లో అమెరికాకు రీతురాజ్…
పాట్నా, నవంబర్ 14 (VGlobe News ):
ఒక చిన్న బగ్… కానీ దాని ప్రభావం మాత్రం భూకంపంలా! ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్… ఏకంగా 53 సెకన్ల పాటు పూర్తిగా స్తంభించిపోయింది. ఆ సమయంలో అమెరికా నుంచి జపాన్ వరకు గూగుల్ ఇంజనీర్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. కానీ ఆ బగ్‌ను గుర్తించి, సాల్వ్ చేసి, సొల్యూషన్‌తో పాటు మెయిల్ కూడా పంపించిన వ్యక్తి… బీహార్‌కు చెందిన ఐఐటీ మణిపూర్ విద్యార్థి రీతురాజ్ చౌదరి!
ఈ ఘటన తర్వాత గూగుల్ ప్రధాన కార్యాలయంలో 12 గంటల పాటు అత్యవసర సమావేశం జరిగింది. ఫలితం… రీతురాజ్‌కు ఏకంగా రూ. 3.66 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ లెటర్! అంతే కాదు, అతని ప్రతిభను వృథా చేసుకోవడం ఇష్టం లేని గూగుల్… అతన్ని వెంటనే అమెరికాకు తీసుకురావాలని నిర్ణయించింది.

కానీ ఇక్కడే ట్విస్ట్! రీతురాజ్ దగ్గర పాస్‌పోర్ట్ కూడా లేదు. సాధారణంగా పాస్‌పోర్ట్ రావాలంటే వారాలు పడుతుంది. కానీ గూగుల్ అధికారులు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి… భారత ప్రభుత్వాన్ని కలుపుకుని… యుద్ధప్రాతిపదికన కేవలం రెండు గంటల్లోనే ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్ సిద్ధం చేయించారు. అది కూడా నేరుగా రీతురాజ్ ఇంటికి డెలివరీ!
తాజాగా… గూగుల్ పంపిన ప్రైవేట్ జెట్ బీహార్‌లో ల్యాండ్ కానుంది. రీతురాజ్ చౌదరి ఆ జెట్‌లోనే అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌కు బయలుదేరనున్నాడు.
ఒక్కసారి ఊహించుకోండి…
మణిపూర్ ఐఐటీ క్యాంపస్‌లో కూర్చున్న ఓ యువకుడు… ఒక్క బగ్‌తో ప్రపంచ దిగ్గజాన్ని కుదిపేస్తే… ఆ దిగ్గజమే రెండు దేశాల ప్రభుత్వాలను కదిలించి, ప్రైవేట్ జెట్ పంపి, కోట్ల రూపాయల జీతం ఆఫర్ చేస్తోంది!
ఇదీ రీతురాజ్ చౌదరి కథ… ఇదీ భారతీయ ప్రతిభ శక్తి!
చదువు, నైపుణ్యం ఉంటే… సరిహద్దులు, పాస్‌పోర్టులు, వీసాలు కూడా అడ్డురావని మరోసారి నిరూపించిన ఈ బీహార్ తేజం… దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
