
టెస్ట్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత సెపక్ టక్రా జట్టు
హర్షం వ్యక్తం చేసిన ప్రేమ్రాజ్, పెరిక సురేష్
హైదరాబాద్ : జపాన్లో జరిగిన ఏషియన్ గేమ్స్ 2026 టెస్ట్ ఈవెంట్‌లో భారత పురుషుల సెపక్‌టక్రా జట్టు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించడం దేశానికి గర్వకారణమని సెపక్‌టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బలమైన పోటీదారులను ఓడించి విజయం సాధించి కీలక మైలురాయిని అదిగమించిందన్నారు.

చీఫ్ కోచ్ హేమరాజ్ నాయకత్వంలో, సెక్రటరీ జనరల్ నరేష్ కుమార్ సమర్థవంతమైన నిర్వహణతో జట్టు ఈ విజయాన్ని సాధించిందని తెలిపారు. విజేతగా నిలిచిన భారత జట్టులో అకాష్ యుమ్నామ్, సందీప్ కుమార్, అరుణ్, రామ్ కుమార్, బాబీ కుమార్, ఎస్. మలమ్గాసింగ్ లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. వీరందరి సమిష్టి కృషి, అంకితభావం దేశానికి గర్వకారణంగా నిలిచాయన్నారు.

అదే విధంగా ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కొలంబోలో జరగనున్న 6వ దక్షిణాసియా సెపక్‌టక్రా ఛాంపియన్‌షిప్‌కు వెళుతున్న భారత జట్టుకు ఆల్ది బెస్ట్ చెప్పారు. జట్టు సభ్యులను తెలంగాణ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, సెపక్‌టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
