
ముంచింతల ఆశ్రమంలో గురు పౌర్ణిమ వేడుకలు.. చిన్న జీయర్ స్వామికి బీజేపీ ఓబీసీ మోర్చా నేతల గురువందనం
హైదరాబాద్, జూలై 30: గురు పౌర్ణిమ సందర్భంగా ముంచింతల ఆశ్రమంలో నిర్వహించిన “గురు వందన” కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ్య శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారిని దర్శించుకుని గురువందనం సమర్పించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా గురువు చూపే ధర్మమార్గం, సమాజ సేవకు అవసరమైన విలువలు, వినయం, నిస్వార్థ సేవా భావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. చిన్న జీయర్ స్వామివారి ఆశీస్సులు సమాజ సేవలో మరింత అంకితభావంతో పనిచేసేలా తమకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ మీడియా సభ్యుడు పెరిక సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి ఎ. రమేష్, రాష్ట్ర కార్యదర్శి సుమన్, నర్సింగి, ప్రభు పూజారితో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గురు అనేది అజ్ఞానాంధకారాన్ని తొలగించి ధర్మమార్గంలో నడిపించే దివ్యశక్తి అని నాయకులు పేర్కొన్నారు. గురువుల ఆశీస్సులతో దేశ, సమాజ సేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా సంకల్పం వ్యక్తం చేశారు.
