హైదరాబాద్, ఫిబ్రవరి 04:

ప్రజల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) మరో కీలక అడుగు వేసింది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంతో పాటు, ఇప్పుడు ప్రతి శనివారం ‘ఫోన్-ఇన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కొత్త కార్యక్రమం ఈ శనివారం నుంచే అమలులోకి రానుందని హైడ్రా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెలవు రోజులు మినహాయించి, ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని నగర ప్రజలు 040-29565750 మరియు 040-29565759 ఈ రెండు ఫోన్ నంబర్లకు కాల్ చేసి తమ ఫిర్యాదులు సమర్పించవచ్చని హైడ్రా పేర్కొంది.

చెరువులు, పార్కులు, రహదారులు, ప్రజా వసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలు, చెరువుల్లో మట్టి పోయడం వంటి అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. అలాగే, గతంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు ఏవైనా ఇంకా పరిష్కారం కాకపోతే, వాటి గురించి కూడా ఈ ఫోన్-ఇన్ కార్యక్రమంలో సమాచారం అందించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు హైడ్రా చేపట్టిన ఈ చర్యలు ప్రజల నుంచి సానుకూల స్పందనలు రావడానికి అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text