
చిన్నారులను మొబైల్లకు దూరం చేయాలి
వారిలో సృజనాత్మకతను పెంచాలి
స్కూల్ అండ్ ఆఫీస్ ఎక్స్పోలో విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు
హైదరాబాద్: చిన్నారులను మొబైల్ ఫోన్ల నుంచి దృష్టి మరలించేందుకు డ్రాయింగ్ పేయింట్ పోటీలను నిర్వహించి వారిలో సృజనాత్మకశక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎక్స్పో గెలాక్సియా ఫౌండర్ డైరెక్టర్ రాఖీ ముఖర్జీ అన్నారు.



శనివారం స్కూల్ అండ్ ఆఫీస్ ఎక్స్పో సందర్భంగా పలు స్కూళ్ల విద్యార్థులకు డ్రాయింగ్, పేయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ మాట్లాడుతూ చిన్నారులకు ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమవుతున్నారని ఫలితంగా రెండు మూడేళ్ల నుంచి చిన్నారుల్లో మొబైల్ మానియా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులకు కలర్ పెన్సిల్స్, పెయింటింగ్ వంటి స్టేషనరీ అందించి వారిలో చిత్రకళల పట్ల అభిరుచిని పెంచాలని సూచించారు.


ఈ సందర్భంగా వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు వచ్చి పెయింట్ కాంపిటీషన్లో పాల్లొన్నారు. కాన్వాస్ పేపర్లపై రంగులను అద్ది చిన్నారులు తమ ప్రతిభను చాటారు. ఈసందర్బంగా విజేతలకు బహుమతులు అందజేశారు.


