అమెరికాలో నిర్వహించనున్న మన తెలుగు అమెరికన్ అసోసియేషన్ (MATA) రెండవ కన్వెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్కు మహబూబాబాద్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త మొగుళ్ల బుచ్చిబాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమన్‌కు ప్రత్యేక హోటల్ వసతి కల్పించడంతో పాటు డిన్నర్ ఏర్పాటు చేశారు.

అనంతరం సుమన్‌తో పలు తెలుగు సంఘాల ప్రతినిధులు, నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరస్పర చర్చలు జరిపించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ సుమన్ వ్యక్తిత్వం ఎంతో గొప్పదని, ఆయన అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి అని కొనియాడారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సుమన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే తమ స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లాకు తరచూ విచ్చేసి ప్రజలను కలవాలని ఆయనను కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సంఘాల ప్రతినిధులు కూడా సుమన్‌ను అభినందిస్తూ, ఆయనతో జరిగిన ముఖాముఖి చర్చ తమకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. MATAరెండవ కన్వెన్షన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text