సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు మరింత భద్రత కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా పథకానికి తోడు, సహజ మరణం సంభవించినప్పటికీ రూ.10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ పథకం ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు, యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా మరణించినట్లయితే, వారికి ఈ బీమా వర్తించనుంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 2024లో సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికీ రూ.10 లక్షల బీమాను అందించాలనే నిర్ణయం తీసుకోవడం విశేషం.

సింగరేణి సంస్థ ఛైర్మన్ & ఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాల మేరకు, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ పథకం అమలులోకి వచ్చింది.

సాధారణంగా ఇతర బీమా సంస్థల్లో రూ.10 లక్షల పాలసీ పొందాలంటే నెలకు కనీసం రూ.5 వేలకుపైగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం చర్యల వల్ల కార్మికులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం పొందనున్నారు.

ఈ నిర్ణయంపై సింగరేణి కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే విధంగా ఇతర బ్యాంకులు కూడా సహజ మరణ బీమా సౌకర్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text