రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతల స్వీకారం

హైదరాబాద్ :

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పట్ల అంకితభావంతో, కష్టపడి పనిచేసిన నాయకుడికి తగిన గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ లక్ష్మణ్ తన కొత్త బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిగా నిర్వర్తిస్తారనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. డాక్టర్ లక్ష్మణ్‌ను హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు బీజేపీ అత్యున్నత జాతీయ నాయకత్వానికి పెరిక సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.

రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ లక్ష్మణ్ ప్రజలకు సంబంధించిన అనేక కీలక సమస్యలను సభలో నిరంతరం ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారని సురేష్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలాన్ని విస్తరించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైందన్నారు. తెలంగాణ నేలపై జన్మించిన డాక్టర్ లక్ష్మణ్ తన కఠోర శ్రమ, రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారని కొనియాడారు. లక్ష్మణ్ ఎప్పుడూ తన బాధ్యతల పట్ల అత్యంత గంభీరతతో వ్యవహరిస్తారని, క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని సురేష్ అన్నారు.

రాజ్యసభ కార్యదర్శి సోమశేఖర్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్టర్​ లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text