
హైదరాబాద్: వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీచేపట్టినట్లు నమో వందే గోమాతరం, వరల్డ్ హిందూ లయన్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ వెల్లడించారు. సంస్థల ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ, వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిరంతరంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో ప్రతిరోజూ వేలాది మందికి చల్లని మజ్జిగ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు, వడదెబ్బ నివారణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచుగా లిక్విడ్స్ తీసుకోవాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
