
పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సత్కారం
హైదరాబాద్: పోలీసు శాఖలో నిబద్ధతతో సేవలందించిన డీసీపీ ముత్యం రెడ్డి ఆదర్శనీయ అధికారిగా గుర్తింపు పొందారని పలువురు పోలీసు అధికారులు కొనియాడారు. ముత్యం రెడ్డి పదవీ విరమణ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు.
1989 జనవరి 16న పోలీసు శాఖలో విధుల్లో చేరిన ముత్యం రెడ్డి ఎస్ఐగా ప్రస్థానం ప్రారంభించి, ఇన్స్పెక్టర్, డీఎస్పీ, అదనపు ఎస్పీ హోదాల్లో పనిచేశారు. 2025లో ఎస్పీ హోదాకు పదోన్నతి పొందారు. శాంతిభద్రతలతో పాటు ఏసీబీ, విజిలెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, తెలంగాణ జెన్కో తదితర విభాగాల్లో సేవలందించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి ప్రసాద్ రెడ్డి ముత్యం రెడ్డి నీ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ ఈ. రామచంద్రారెడ్డి, వరంగల్ ఎస్పీ బి. వెంకట్రెడ్డి, గద్వాల ఎస్పీ రంజన్ రతన్, గ్రేహౌండ్స్ ఎస్పీ గంగారెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ముత్యం రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన భవిష్యత్తు జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
